నర్సాపూర్, వెలుగు: లస్సీలో టాయిలెట్ పోసి అమ్మినట్లు ప్రచారం జరగడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలోని హైవేను ఆనుకొని ఉన్న ఏ1 జ్యూస్ సెంటర్‌లో ఓ బాలుడు శుక్రవారం గ్లాసులో మూత్రం పోస్తుండగా గమనించిన స్థానికులు నిలదీసి, ఆందోళన చేపట్టారు. పోలీసులు అక్కడికి చేరుకొని లస్సీ సెంటర్ యజమాని, బాలుడిని స్టేషన్‌కు తరలించారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాలుడు గ్లాసులో మూత్రం పోసిన మాట వాస్తవమేనని, లస్సీలో కలపలేదని ఎస్సై రంజిత్ రెడ్డి తెలిపారు.
